పైనుంచి చూస్తే పుచ్చకాయ‌ల లోడులాగే ఉంది.. అడుగున చెక్ చేసి కంగుతిన్న పోలీసులు

|

Jun 06, 2021 | 3:06 PM

ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పుచ్చకాయల మాటున‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా...

పైనుంచి చూస్తే పుచ్చకాయ‌ల లోడులాగే ఉంది.. అడుగున చెక్ చేసి కంగుతిన్న పోలీసులు
Watermeloan Red Sandal
Follow us on

ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పుచ్చకాయల మాటున‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా చిక్కారు రెడ్‌ స్మగ్లర్లు. పుచ్చకాయల లోడ్‌ కింద ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డారు.నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెం చెక్‌పోస్ట్ వద్ద పుచ్చకాయల లోడులో ఎర్రచందనం తరలిస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వాహనం స్పీడ్‌గా పోనిచ్చారు దుండగులు. పోలీసులు ఆ వాహనాన్ని ఛేజ్‌ చేయడంతో.. డ్రైవర్‌, క్లీనర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనాన్ని తనిఖీ చేయగా.. పుచ్చకాయల కింద సుమారు రెండున్నర లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. టాటా ఏసీ వాహనం, ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. కడప జిల్లా కలసపాడుకి చెందిన వాహనంగా గుర్తించారు.

Red Sandal

మ‌రోవైపు చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచి కలప డంప్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ప‌ట్టుకుంది. గంగమ్మ కోన వద్ద యూకలిప్టస్ ట్రీ ప్లాంటేషన్ దాటిన తరువాత ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు పది చోట్ల డంప్ చేసి ఉంచిన 101 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ప్రత్యేక బృందాలు నాగలాపురం వద్ద ఉన్న జంబుకేశ్వరపురం అడవిలోని గంగమ్మ కోన గుట్టలల్లో జెబికె పురం ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.

Also Read: మొత్తుకుంటున్నా విన‌ని జ‌నాలు.. సండే వ‌చ్చిందంటే ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వ‌ద్ద ర‌చ్చ‌, ర‌చ్చ