Crime: పెళ్లి చేయమని కోరితే.. పెళ్లయిపోయినట్లు పత్రాలు సృష్టించాడు.. కారణం తెలిస్తే అవాక్కే

|

Jul 27, 2022 | 7:43 PM

కొన్నేళ్ల క్రితం పెళ్లిళ్లు చేయాలంటే ఇంట్లో పెద్దవారు గానీ, తెలిసిన వారి ద్వారా గానీ మంచి సంబంధం చూసి వివాహం జరిపించేవారు. ఇరు కుటుంబాల స్థితిగతులు చూసిన తర్వాత పెళ్లి చేసేవారు. అయితే విపరీతంగా పెరిగిన టెక్నాలజీతో మనుషుల మధ్య మానవ...

Crime: పెళ్లి చేయమని కోరితే.. పెళ్లయిపోయినట్లు పత్రాలు సృష్టించాడు.. కారణం తెలిస్తే అవాక్కే
Marriage
Follow us on

కొన్నేళ్ల క్రితం పెళ్లిళ్లు చేయాలంటే ఇంట్లో పెద్దవారు గానీ, తెలిసిన వారి ద్వారా గానీ మంచి సంబంధం చూసి వివాహం జరిపించేవారు. ఇరు కుటుంబాల స్థితిగతులు చూసిన తర్వాత పెళ్లి చేసేవారు. అయితే విపరీతంగా పెరిగిన టెక్నాలజీతో మనుషుల మధ్య మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉద్యోగం, చదువు కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడటంతో కుటుంబసభ్యుల మధ్య సరైన బంధం ఉండటం లేదు. ఇక పెళ్లి సంబంధాలు చూసే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ క్రమంలోనే మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొచ్చాయి. ప్రొఫైల్, ప్యాకేజీకి తగిన వధువరుల్ని వెతికి పెడతామంటూ ప్రకటిస్తాయి. వీటికి త్వరగానే ఆకట్టుకుంటున్న యువతరం కొన్ని సందర్భాల్లో మోసపోతున్నారు. తాజాగా పుణెలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి సంబంధం చూడలని కోరిన యువతి పట్ల మ్యాట్రిమోనీ నిర్వహకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమెకు పెళ్లి అయినట్లు పత్రాలు సృష్టించేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు.

విషయం తెలుసుకున్న బాధితురాలు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ బ్యూరో ఆపరేటర్ ను పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదనను తాను తిరస్కరించానని, అలా చేయడం వల్లే అతను ఈ ఉదంతానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ ధ్రువపత్రాలను మ్యారేజ్ బ్యూరో నిర్వహకుడి స్నేహితుడు రూపొందించాడని గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, చీటింగ్, ఫోర్జరీ, పరువు నష్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి