అవి పేరుకే లాడ్జీలు.. లోపల జరిగేదంతా సపరేటు..!

అంతా ఆన్‌లైన్‌.. ఎవ్వరికీ అనుమానం రాదు. టైమ్‌ టు టైమ్‌. ఇలా బుక్‌ చేసుకున్నామా..? అలా పని అయిపోవాల్సిందే. అలాగే ఆ హోటళ్లలో ముందే అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చు కూడా. ఓ కార్పొరేట్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ లాడ్జీల్లో… ఢిల్లీ కేంద్రంగా పెద్ద నెట్‌వర్క్‌ నడుస్తోంది. కాలు కదపకుండా.. కూర్చున్నచోటే కోట్ల రూపాయల్లో ఆన్‌లైన్‌ వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్‌లో నయా దందా విస్తరిస్తోంది. కామక్రీడల నిలయంగా మారుతోంది. ఐదంకెల జీతం తీసుకుంటున్న వారితోపాటు బడాబాబులు సైతం.. ఆ […]

అవి పేరుకే లాడ్జీలు.. లోపల జరిగేదంతా సపరేటు..!

అంతా ఆన్‌లైన్‌.. ఎవ్వరికీ అనుమానం రాదు. టైమ్‌ టు టైమ్‌. ఇలా బుక్‌ చేసుకున్నామా..? అలా పని అయిపోవాల్సిందే. అలాగే ఆ హోటళ్లలో ముందే అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చు కూడా. ఓ కార్పొరేట్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ లాడ్జీల్లో… ఢిల్లీ కేంద్రంగా పెద్ద నెట్‌వర్క్‌ నడుస్తోంది. కాలు కదపకుండా.. కూర్చున్నచోటే కోట్ల రూపాయల్లో ఆన్‌లైన్‌ వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్‌లో నయా దందా విస్తరిస్తోంది. కామక్రీడల నిలయంగా మారుతోంది. ఐదంకెల జీతం తీసుకుంటున్న వారితోపాటు బడాబాబులు సైతం.. ఆ లాడ్జీలవైపు ఆకర్షితులవుతున్నారట.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్‌, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఐటీ కారిడార్‌ సమీపంలోని లాడ్జీల్లో కోట్ల రూపాయల్లో దందా జరుగుతోంది. అలాగే.. మాదాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట్‌, అబిడ్స్‌ ప్రాంతాల్లోని కూడా ఈ రకమైన లాడ్జీలు దర్శనమిస్తున్నాయి.

వేలసంఖ్యలో ఉన్న హోటల్స్‌‌లను, లాడ్జీలను ఓ కార్పొరేట్‌ సంస్థ లీజుకు తీసుకుని ఈ దందా నడిపిస్తోంది. ఎంతోమంది బడాబాబులతోపాటు యువతీ యువకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని ఆ అవసరాలను తీర్చుకుంటున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే యూత్‌ను టార్గెట్‌ చేసుకుని దేశవ్యాప్తంగా ఈ వ్యవహరం నడుస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఐడీ ప్రూఫ్‌ ఉంటే చాలు.. ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూ.. గంట, రెండు గంటల పాటు గదులు అద్దెకు ఇస్తున్నారు. దీంతో లాడ్జీల దగ్గర యువత బారులు తీరుతున్నట్టు సమాచారం. అంతేకాదు ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్లు , ఫ్లాట్లను లీజుకి తీసుకుని సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ పేరుతో దందా కొనసాగిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా.. పోలీసులు ఈ నయాదందాపై దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సరియైన నిఘా లేకపోవడంతో వ్యవహారం గుట్టుగా నడుస్తోంది. ఒకప్పుడు పార్కుల్లో కనిపించే జంటలు ఇప్పుడు తగ్గిపోయాయి. దానికి కారణం ఐడీ ప్రూఫ్‌ లేకుండానే రెండు, మూడు గంటలపాటు సులభంగా అద్దెకు ఇచ్చే లాడ్జీలు కుప్పలు… తెప్పలుగా పుట్టుకొచ్చాయి. యువతను పక్కదారి పట్టిస్తున్న ఇలాంటి విష సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Published On - 4:05 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu