Prostitution Gang Arrested : హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్‌.. సాయి దుర్గా లాడ్జ్ కేంద్రంగా వ్యవహారం..

| Edited By: Team Veegam

Apr 12, 2021 | 4:17 PM

Prostitution Gang Arrested : హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న కొంతమంది ముఠా సభ్యుల్ని రాచకొండ పోలీసులు

Prostitution Gang Arrested : హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్‌.. సాయి దుర్గా లాడ్జ్ కేంద్రంగా వ్యవహారం..
Crime News
Follow us on

Prostitution Gang Arrested : హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న కొంతమంది ముఠా సభ్యుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతో దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి సాయి దుర్గా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం తెలిసింది. మానవ రవాణాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళా సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి ఈ తతంగం నడిపిస్తున్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ టీం, ఎల్బీ నగర్ పోలీసులు సంయుక్తంగా సాయి దుర్గా లాడ్జిపై దాడి చేసి సెక్స్ రాకెట్ ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మొదటగా సాయి దుర్గా లాడ్జిలోని గదుల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించారు. రిసెప్షన్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో, విచారణ చేయగా వారు తమ పేర్లను సాయి దుర్గా లాడ్జ్ యజమాని అయిన దేసినేని వెంకటేశ్వర్ రావు, మాండ్లా అవినాష్ @ నాని అని వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వర్ రావు, చార్మినార్‌కి చెందిన సకిజాన్ ఖాతున్ @ దీపిక @ రేష్మా, మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండ్ల అవినాష్, మీర్‌పేట్ కు చెందిన రవి, ఖమ్మం జిల్లాకు చెందిన గుగులోతు సుజాతలు ఈ ముఠాలో మెయిన్‌ సభ్యులు.

కాగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వర్ రావు లాడ్జ్‌లో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తూ ఇప్పటికే భారీగా డబ్బు సంపాదించాడు. ఫిబ్రవరిలో “సాయి దుర్గా లాడ్జ్” ను రూ. 75,000 / లీజుకు తీసుకొని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వినియోగిస్తున్నాడు. జంటలకు గదులు ఇవ్వడం వారి నుంచి రూ.300 నుంచి 500 వరకు వసూలు చేయడం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు కూడా ఇందులోనే గదులు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గతంలో వీరిని మీర్పేట్ పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అరెస్టు చేశారు. 10 రోజుల క్రితం బెయిల్‌పై జైలు నుంచి వచ్చిన వారు మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

చిరిగిన జీన్స్, వీటి ధారణ మన సంస్కృతికి చిహ్నమా ? వివాదం రేపిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రి విలేజ్‌ పిడుగు.. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనన్న కమిటీ..