Property Dispute: మహిళా న్యాయవాదిపై నడిరోడ్డుపై దాడి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

|

May 15, 2022 | 2:09 PM

ఒక మహిళా న్యాయవాదిపై( Woman advocate ) నడిరోడ్లో దాడి జరిగింది. కనికరం లేకుండా కొడుతూ కాళ్లతో తన్నుతూ పాశవికానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆమెతో పాటు.. ఆమె బంధువుల మీద కూడా విరుచుకుపడ్డాడు. నెత్తురోడేలా కొట్టాడు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన పంచాయితీనే ఈ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. కాపాడండి కాపాడండి అంటూ ఆమె భర్తను వెతుక్కుంటూ పోతున్న వైనం.. అక్కడున్న వాళ్లను కదిలించింది. కానీ… ఆ కొడుతున్న వ్యక్తి దగ్గర మాత్రం కనికరం లేదు. ఆమెను […]

Property Dispute: మహిళా న్యాయవాదిపై నడిరోడ్డుపై దాడి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Woman Advocate Assaulted
Follow us on

ఒక మహిళా న్యాయవాదిపై( Woman advocate ) నడిరోడ్లో దాడి జరిగింది. కనికరం లేకుండా కొడుతూ కాళ్లతో తన్నుతూ పాశవికానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆమెతో పాటు.. ఆమె బంధువుల మీద కూడా విరుచుకుపడ్డాడు. నెత్తురోడేలా కొట్టాడు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన పంచాయితీనే ఈ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. కాపాడండి కాపాడండి అంటూ ఆమె భర్తను వెతుక్కుంటూ పోతున్న వైనం.. అక్కడున్న వాళ్లను కదిలించింది. కానీ… ఆ కొడుతున్న వ్యక్తి దగ్గర మాత్రం కనికరం లేదు. ఆమెను కాపాడ్డానికి వచ్చిన భర్త నవీన్‌పై రాళ్లతో దాడి చేశారు. గాయపడ్డ నవీన్‌ని, సొమ్మసిల్లిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కర్నాటక బాగల్‌కోట్‌లో ధనుష్ అనే హాస్పిటల్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన… లోకల్‌గా సెన్సేషన్ అయింది.

బాధిత మహిళా లాయర్ పేరు సంగీత. ఆమె మామ మమంతప్ప కూడా ఈ ఘటనలో గాయపడ్డట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడింది స్థానిక బీజేపీ నాయకుడికి అనుచరుడు. మొబైల్‌లో షూట్ చేసిన ఈ వీడియో ఆ తర్వాత విపరీతంగా వైరల్ అవుతోంది. నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. ఘటనకు కారణాలేంటని ఆరా తీస్తున్నారు. యాక్షన్ పార్ట్‌లో దిగారు.

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..