Salaar Movie: విషాదం.. సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. ప్రభాస్ అభిమాని మృతి..

|

Dec 22, 2023 | 8:58 AM

పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాను బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్‏కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు.

Salaar Movie: విషాదం.. సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. ప్రభాస్ అభిమాని మృతి..
Salaar Movie
Follow us on

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్‏తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాను బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్‏కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు.

ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాలరాజు మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత రాత్రి మృతుడి బంధువులు, ప్రభాస్ అభిమానులు నిరసన తెలిపారు. కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్మవరం 1వ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిరసన తెలుపుతున్నవారిని అక్కడి నుంచి పంపించేశారు. బాలరాజు మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.