Police Thieves: మందులోకి ముక్క లేదని, మేకలను దొంగించిన పోలీసులు.. ఎలా బయటకు వచ్చిందంటే?

|

Jan 02, 2022 | 9:07 AM

నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలనుకున్నారు పోలీసులు.. చుక్క అయితే దొరికింది కానీ, ముక్క దొరకలేదు. దీంతో పక్కాగా ఫ్లాన్ చేశారు..

Police Thieves: మందులోకి ముక్క లేదని, మేకలను దొంగించిన పోలీసులు.. ఎలా బయటకు వచ్చిందంటే?
Police Stolen Goats
Follow us on

Police Stolen Goats: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలనుకున్నారు పోలీసులు.. చుక్క అయితే దొరికింది కానీ, ముక్క దొరకలేదు. దీంతో పక్కాగా ఫ్లాన్ చేశారు.. ఇంకేముందుకు మూడో కంటికి కనిపించకుండా పోలీసులు మేకలను తస్కరించారు.. అవును, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందులో నాన్‌వెజ్ వడ్డించేందుకు మేకలను చోరీ చేశారు. ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకలు పెంచుకుంటున్నాడు. వాటితోనే ఆయన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి.. అతడి మందలో రెండు మేకలు మాయమయ్యాయి. దీంతో ఇరుగు పొరుగు ఆరా తీయగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు మేకల కాపరి. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

పోలీసు స్టేషన్‌కు చేరుకున్న సంకీర్తనగురు అక్కడి దృశ్యాలను చూసిన అవాక్కయ్యాడు. అతనికి సంబంధించిన రెండు మేకలు అప్పటికే వాటిని కోసేందుకు పోలీసులు సిద్ధం కాగా చూసి అడ్డుకున్నాడు. తన మేకలు తనకు ఇవ్వమని పోలీసులను నిలదీశాడు. వారు వినిపించుకోలేదు సరికదా, సంకీర్తనగురును బెదిరించి పంపేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. ఈసారి అందరూ కలిసొచ్చి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, మరోమారు బెదిరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ జరిపించిన ఎస్పీ.. ఏఎస్ఐ సుమన్‌ మల్లిక్‌ను నిన్న విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Read Also… New Year 2022: న్యూ ఇయర్ వేడుకల్లో మందే కాదండోయ్.. ఎంత ఫుడ్‌ లాగించారో తెలుసా.?