ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్

|

Apr 02, 2021 | 10:01 AM

ఒకరు కాదు ఇద్దరు కాదు... వందల మంది. హైదరాబాద్‌లోనే కాదు. ముంబై, జైపూర్‌ చాలా చోట్లకు పాకిందీ కిలాడీ గుంపు. శ్రీకాంత్‌ లాంటి వాళ్లు ఎంతోమంది పరువు పోతుందని బయటపడలేక లోలోపలే కుమిలిపోతున్నారు. నిజామాబాద్ హానీ ట్రాప్ కేసుల సంచలన విషయాలు వెలుగులేకి వస్తున్నాయి.

ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్
Honey Trap
Follow us on

Nizamabad Honey Trap: నిజామాబాద్‌ హనీ ట్రాప్‌ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. కిలాడీ లేడీల వలపు వలకు చిక్కిన లిస్ట్‌ చాంతాడంత తేలుతోంది. శ్రీకాంత్‌తో పాటు ఈ లిస్ట్‌లో చాలామంది బాధితులున్నట్లు సమాచారం. అయితే వారంతా తాము బయటికొస్తే పరువు పోతుందని ఫిర్యాదు చేయడంలేదు. నిజామాబాద్‌ జిల్లా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి శ్రీకాంత్‌ ఆత్మహత్య కేసులో పోలీసు దర్యాప్తు స్పీడ్‌ అందుకుంది.

శ్రీకాంత్‌ కాల్‌ డేటా, సిగ్నల్‌ డంప్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కిలాడీ లేడీ బ్లాక్‌మెయిల్ దందా ఎక్కడి నుంచి నడిపారానే దానిపై ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్‌తోపాటు లిస్ట్‌లో చాలా మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది. పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడంలేదు బాధితులు. హైదరాబాద్‌, ముంబై, జైపూర్‌ కేంద్రంగా గ్యాంగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శ్రీకాంత్‌ తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు స్పీడప్ అయింది.

నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. నేను సింగిల్‌. నీతో చాట్‌ చేయాలని అనుకుంటున్నా అంటూ వచ్చిన మెసేజ్‌కు స్పందించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తూ ఓ లేడీ కవ్విస్తూ మాట్లాడింది. తర్వాత వీడియో కాల్‌ చేసి చాటింగ్‌ చేసింది. నగ్న వీడియోలు కావాలంటూ రెచ్చగొట్టి ట్రాప్‌ చేసింది.

ఆ తర్వాత నుంచి యువకుడికి వేధింపులు పెరిగాయి. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ టార్చర్‌ మొదలైంది. తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న 24 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసినా బెదిరింపులు ఆగలేదు. భయపడిన యువకుడు నాలుగు రోజుల కిందట సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ముఠాలు ఇటీవల పెరిగాయని…ఫోన్‌కు వచ్చే మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Corona: దశదిన కర్మకు వెళ్లినవారిలో 26 మందికి పాజిటివ్.. నిర్ధారించిన వైద్యాధికారులు.. భయం గుప్పిట్లో గ్రామస్థులు

PM Modi Prayers at Madurai Temple Photos: మదురైలోని మీనాక్షి దేవి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు..

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…