AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Incident: మహబూబాబాద్‌ జిల్లాలో అమానుష ఘటన.. మామిడి కాయలు కోశారని పిల్లల నోట్లో..

Shocking Incident: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం కంటెపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయలు కోశారని..

Shocking Incident: మహబూబాబాద్‌ జిల్లాలో అమానుష ఘటన.. మామిడి కాయలు కోశారని పిల్లల నోట్లో..
Minor Boys
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2021 | 8:15 AM

Share

Shocking Incident: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం కంటెపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయలు కోశారని కారణంతో ఇద్దరు పిల్లలను తోట కాపరులు చిత్ర హింసలకు గురి చేశారు. పిల్లలను తాడుతో కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా వారి నోట్లో ఆవు పేడ కుక్కి వారికి నరకం చూపించారు. పైగా ఈ ఘటనను కొందరు వీడియో తీయగా.. అదికాస్తా సోషల్ మీడియాకెక్కింది. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కంటేపాలెం గ్రామంలో బేడబుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పిల్లలు మామిడి తోటలు మామిడి కాయలు కోశారు. అది గమనించిన తోట కాపరులు.. వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిద్దరి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి కర్రతో విపరీతంగా కొట్టారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తూ తోట కాపరులు నవ్వుకుంటూ రాక్షసానందం పొందారు. క్షమించమని, వదిలేయండి అంటూ ఆ పిల్లలు ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. పైగా ఓ వ్యక్తి ఆవు పేడను తీసుకువచ్చి వారి నోట్లో కుక్కాడు. ఆవు పేడను నోట్లో కుక్కి, నీటిని పోసి రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తించారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు అసలు మనుషులా? పశువులా? అంటూ ఫైర్ అవుతున్నారు. సదరు తోట కాపలాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

New Zealand Vs Bangladesh :18 బంతుల్లో 50 పరుగులు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్..

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. రూ.400 పెరిగిన సిల్వర్‌ ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు