Nalgonda District: మైసమ్మ గుడి ముందు మనిషి తల కేసులో పోలీసుల పురోగతి

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీ మైసమ్మ గుడి ముందున్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి తల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

Nalgonda District:  మైసమ్మ గుడి ముందు మనిషి తల కేసులో పోలీసుల పురోగతి
Nalgonda Murder Case

Updated on: Jan 11, 2022 | 8:13 AM

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీ మైసమ్మ గుడి ముందున్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి తల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మొండెం లేని తలభాగం కలిగిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హతుడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యం పహాడ్ కు చెందిన మతిస్థిమితం లేని జహెందర్ నాయక్ గా గుర్తించారు.

మతిస్థిమితం లేని జయేందర్ నాయక్ కొంతకాలంగా ఇబ్రహీంపట్నంలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. జాహెందర్ నాయక్ ఇతర శరీర భాగాల కోసం పోలీసుల గాలింపు చర్యలు జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల్లోని కాటన్ మిల్లులు, కోళ్ల ఫారాలను పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.  అయితే ఇది హత్యా? లేక నరబలా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

Also Read: ఆ సీన్‏తో చిక్కుల్లో పడ్డ హీరోయిన్.. అనుపమను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..