అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ శివారు బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైంది.

అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

Updated on: Oct 06, 2020 | 3:17 PM

హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ శివారు బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైంది. జాతీయ రహదారిపై బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాదాపూర్ చంద్రనాయక్ తండాకు చెందిన బాలుడు ఆదివారం మధ్యాహ్నం బాలుడు కనిపించకుండా పోయాడు.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మాదాపూర్ ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తి బాలుడ్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా మేడిపల్లి పోలీసు స్టేషన్ ఉన్నాడు. ఎట్టకేలకు బాలుడి ఆచూకీ లభించడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. కాగా, బాలుడి విచారించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.