Police Constable Illegal Affair: ఒకరు కాదు..ఇద్దరు కాదు..నలుగురితో పెళ్లి..పలువురితో వివాహేతర సంబంధాలు. ఇది ఓ కానిస్టేబుల్ వ్యవహారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖపట్నానికి చెందిన అప్పలరాజు CCRB కానిస్టుబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈయనగారు నిత్య పెళ్లికొడుకుగా అవతారమెత్తారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ జాగ్రత్తపడ్డాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయ్యగారు అంతటితో ఆగలేదు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. అప్పలరాజును పెళ్లి చేసుకున్న పద్మ.. మహిళా సంఘాలతో కలిసి మీడియాను ఆశ్రయించడంతో కానిస్టేబుల్ అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది.
కానిస్టేబుల్ అప్పలరాజు తనతోపాటు పలువురు మహిళలను మోసం చేశారని ఆమె ఆరోపించింది. తనకు తెలియకుండానే నాలుగుసార్లు అబార్షన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతోపాటు నలుగురు మహిళలను పెళ్లిళ్లూ చేసుకొని వేర్వేరు ప్రాంతాల్లో కాపురం పెట్టారని కుండబద్దలు కొట్టి చెబుతోంది. ఇదేంపని ప్రశ్నించినందుకు తనను దూరం పెట్టాడని ఆరోపించింది. గతంలో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అతని ప్రవర్తనలో కొంత మార్పు వచ్చిందని తెలిపింది. ఐతే అప్పలరాజు మళ్లీ అలాగే ప్రవర్తిస్తున్నారని..తనకు న్యాయం చేయాలంటోంది బాధితురాలు పద్మ.
మరోవైపు మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కానిస్టేబుల్ అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకురాలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న కీచక కానిస్టేబుల్‌ను వెంటనే అతన్ని సస్పెండ్ చేసి…అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.
Badvel By Election: వారసత్వ రాజకీయాలకు నో అంటున్న బీజేపీ.. ఓటింగ్ ఏకపక్షమే అంటున్న వైసీపీ
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 534, నిఫ్టీ 159 పాయింట్ల వృద్ధి