విశాఖ ఏజెన్సీలో లిక్విడ్‌ గంజాయి కలకలం.. ఒకరి అరెస్ట్..

విశాఖలో మళ్లీ గంజాయి కలకలం రేగింది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని ద్రవరూపంలో సప్లే చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. హుకుంపేట మండంలం పరిధిలోని నందివలసలో ఎక్సైజ్‌ శాఖ తనిఖీలు చేపట్టింది.

విశాఖ ఏజెన్సీలో లిక్విడ్‌ గంజాయి కలకలం.. ఒకరి అరెస్ట్..

Edited By:

Updated on: Jun 17, 2020 | 8:47 PM

విశాఖలో మళ్లీ గంజాయి కలకలం రేగింది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని ద్రవరూపంలో సప్లే చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. హుకుంపేట మండంలం పరిధిలోని నందివలసలో ఎక్సైజ్‌ శాఖ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో గంజాయిని ద్రవరూపంలో తరలిస్తున్న ముఠా గుట్టురట్టైంది. 14 లీటర్ల హాషిప్‌ ఆయిల్‌ను సీజ్‌ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ హాషిప్ ఆయిల్ విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

కాగా, గతంలో గంజాయి సప్లై ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు అనేక మార్గాల్లో తరలించేవారు. అయితే పోలీసులు తనిఖీలు కఠినంగా చేయడంతో స్మగ్లర్లు రూట్ మార్చారు. ఇప్పుడు లిక్విడ్ గంజాయి దొరకడంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.