Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో అతడ్ని జిల్లా జైలుకు తరలించారు.
అక్క భర్తతో ఎస్కేప్ అయిన యువతి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి
కర్ణాటకలోని కన్యాడికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితమే పెద్దమ్మాయి సౌధాను ముస్తాఫా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక తరుచూ అత్తారింటికి వచ్చే క్రమంలో.. ముస్తాఫా చిన్న కూతురు రైహానాతో మాటలు కలిశాయి. వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం కూడా ప్రారంభించారు. వీరి బంధం మరింత బలపడి ఏకంగా ఇద్దరు కలిసి పారపోయే స్టేజ్‌కు చేరుకుంది. జులై 8న రైహానా వరుసకు బావ అయ్యే ముస్తాఫాతో ఇంటి నుంచి పారిపోయింది.
ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తండ్రి మహమ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పెద్ద కూతురు సౌధాకు అల్లుడితో ఇటీవల మనస్పార్థాలు రావడంతో ఆమె తమతోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జులై 8న ముస్తాఫా కారులో తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలోనే తన చిన్న కూతురు రైహానా.. చేతిలో బ్యాగు పట్టుకొని అదే కారులో అల్లుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read also: Ravi Shankar Prasad: తమిళనాడు గవర్నర్‌గా మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.?