నటి నుంచి బలవంతపు వసూళ్లు.. గ్యాంగ్ సూత్రధారి అరెస్ట్

దక్షిణాది నటి షామ్నా కాసిం నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిన ముఠా లోని సూత్రధారిని, మరో ఆరుగురిని కేరళలోని కోచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లోని మహమ్మద్ షరీఫ్ అనే ప్రధాన నిందితుడితో..

నటి నుంచి బలవంతపు వసూళ్లు.. గ్యాంగ్ సూత్రధారి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 12:12 PM

దక్షిణాది నటి షామ్నా కాసిం నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిన ముఠా లోని సూత్రధారిని, మరో ఆరుగురిని కేరళలోని కోచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లోని మహమ్మద్ షరీఫ్ అనే ప్రధాన నిందితుడితో బాటు మరి కొందరు అరెస్టయినవారిలో ఉన్నారు. గతంలో శరత్, అష్రఫ్, రఫీఖ్, రమేష్ అనే నలుగురిని అరెస్టు చేశామని.. దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లయిందని వారు చెప్పారు. పూర్ణ అనే పేరిట షా మ్నా కాసిం పలు తెలుగు, తమిళం, మలయాళం మూవీల్లో నటించింది. కాగా మోడలింగ్ రంగంలో మంచి అవకాశాలు కల్పిస్తామంటూ గత మార్చిలో ఎనిమిది మంది యువతులను ప్రలోభ పెట్టడమే గాక, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి కుటుంబాల నుంచి బలవంతంగా డబ్బు గుంజేందుకు పలక్కాడ్ జిల్లాలో వారిని కొన్ని  రోజులపాటు ఈ ముఠా నిర్బంధించిందన్న ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. షామ్నా తండ్రి ఇఛ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు వల పన్ని ఈ గ్యాంగ్ ను పట్టుకున్నారు. వారు వాడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. షామ్నా కేసు బయటపడడంతో.. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన మరో నలుగురు మోడల్స్ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వీరు ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టారని, గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ లో తమను వినియోగించుకోజూశారని ఆ యువతులు పేర్కొన్నారు. షామ్నా కాసిం ఆదివారం హైదరాబాద్ నుంచి కోచ్చి చేరుకోవాల్సి ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని సేకరించనున్నారు.

Latest Articles