POK Accident: ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది ప్రయాణికుల దుర్మరణం.. 8 మందికి..

POK Road Accident: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో

POK Accident: ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది ప్రయాణికుల దుర్మరణం.. 8 మందికి..
Pok Road Accident

Updated on: Nov 03, 2021 | 7:53 PM

POK Road Accident: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి.. 22 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు.. సుధోంటి జిల్లా బలోచ్‌ ప్రాంతం నుంచి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో బుధవారం అకస్మాత్తుగా రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులోకి పడిపోయిందని.. పోలీసులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదాన్ని చూసిన ఓ వ్యాపారి వెంటనే అక్కడే ఉన్న ఓ మత పెద్దకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన మసీదులోని మైకులో ప్రమాదం గురించి చెప్పడంతో… స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పీవోకే ప్రమాదకరమైన రహదారులతో కూడిన పర్వత ప్రాంతం కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Also Read:

Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..