తమిళనాడును కుదిపేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం..

|

Sep 06, 2020 | 8:49 PM

తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం కుదిపేస్తోంది. రైతుల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి ప్రతి జిల్లాలోనూ కోట్లలో నగదును దళారులు దోపిడీ చేస్తున్నారు.

తమిళనాడును కుదిపేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం..
Follow us on

తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కాం కుదిపేస్తోంది. రైతుల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి ప్రతి జిల్లాలోనూ కోట్లలో నగదును దళారులు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని కడలూరు, కరూర్, తిరువణ్ణామలై, తిరుచ్చి, తంజావూర్, సహా పలు జిల్లాల్లో రైతుల పేరుతో కోట్లలో నగదును దోపిడీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వరదలు, కరువు సమయంలో రైతులకు సహాయం అందించేలా కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి స్కీంను ప్రవేశపెట్టింది.(PM Kisan Samman Nidhi Scheme)

ఈ స్కీం ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు చేరేలా ఏర్పాటు చేసింది. ఇక దీన్ని తమకు అనుగుణంగా మార్చుకొని కొంతమంది దళారులు తాము కూడా రైతులమంటూ.. నకిలీ పత్రాలను సృష్టించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేల సంఖ్యలో దళారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్కీం ద్వారా ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 2 వేల నుంచి 4 వేల వరకు నగదును అధికారులు బదిలీ చేశారు. రైతుల ముసుగులో ఒక్క తిరువణ్ణామలై జిల్లాలోనే దళారులు సుమారు 18 కోట్ల రూపాయిలు దోపిడీ చేసినట్లు గుర్తించారు. అలాగే కడలూరు జిల్లాలో 5 కోట్లు, మధురైలో 2 కోట్లు దోపిడీ చేశారు. ఇక రంగంలోకి దిగిన సీబీసీఐడీ అధికారులు ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.