సంచలనం సృష్టించిన వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ మర్డర్ కేసులో మంగళవారం మరో నలుగురిని పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో సహా నలుగురిని సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మృతుడు రాం ప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారం అందించిన చంద్రిక ఆనంద్( 28) హత్య జరిగిన ప్రాంతంలో ఎవరూ రాకుండా చూసుకున్న శ్రీరామ్ రమేశ్ (29), మరో ఇద్దరు నిందితులు షేక్ అజారుద్దీన్ ( 30), పత్తిపాటి నరేష్ ( 28)లను జూబ్లీహిల్స్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కోగంటి సత్యంకు చెందిన గెస్ట్ హౌస్‌లో అరెస్ట్ చేశారు.
కాగా ఈ హత్యకు సహకరించిన తిరుపతి సురేశ్, మరో నిందితుడు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.