చిన్నారుల పాలిట యమకింకరుల్లా కిడ్నాపర్లు..! బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలీక తల్లడిల్లిపోతోన్న తల్లిదండ్రులు

చిన్నారుల పాలిట యమకింకరుల్లా మారుతున్నారు కిడ్నాపర్లు. ఎవరు వస్తున్నారో ? ఏం చేస్తున్నారో.. ?, వాళ్ల కంట పడకుండా బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలియక భయపడిపోతున్నారు తల్లిదండ్రులు...

చిన్నారుల పాలిట యమకింకరుల్లా కిడ్నాపర్లు..!  బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలీక తల్లడిల్లిపోతోన్న తల్లిదండ్రులు
Kidnap

Updated on: Jul 10, 2021 | 10:17 PM

Kidnappers: చిన్నారుల పాలిట యమకింకరుల్లా మారుతున్నారు కిడ్నాపర్లు. ఎవరు వస్తున్నారో ? ఏం చేస్తున్నారో..?, వాళ్ల కంట పడకుండా బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలియక భయపడిపోతున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్ నగర శివార్లలో నాలుగు రోజులుగా అత్యాచారాలు, కిడ్నాప్‌ల వ్యవహారం చూస్తుంటే …హజీపుర్‌ తరహా ఘటనలే ఇక్కడ జరిగాయా అన్న అనుమానాలు పోలీసులు, స్థానికుల్లో కలుగుతున్నాయి.

శుక్రవారం హైదరాబాద్ శివారు జవహర్‌నగర్ పీఎస్‌ పరిధిలోని దమ్మాయిగూడలో పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. స్థానికులు అలర్ట్ కావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కిడ్నాపర్‌ పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు అతను ఎవరూ ? ఎందుకొచ్చాడు ? ఎందుకు పారిపోయాడని ? కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది.

అయితే, నిన్న కిడ్నాప్‌ కోసం ప్రయత్నించిన చోటే నాలుగు రోజుల క్రితం మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న జవహర్‌నగర్ పోలీసులు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి కోసం చుట్టుపక్కల గాలించి అతడ్ని పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన ఈ ఆగంతకుడు.. భార్యతో తరచూ గొడవపడుతూ సైకోగా మారినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న మూడేళ్ల బాలికపై ఇతడే అత్యాచారం చేశాడా లేక వేరే వ్యక్తులు చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. చిన్నపిల్లలే టార్గెట్‌గా లైంగిక వేధింపులకు పాల్పడుతోంది ఇతడేనేమోనని అనుమానిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read also: Guntur: నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే..! అంటూ బ్లేడుతో ఒళ్ళంతా చెక్కేశాడు