AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..

సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ ఇంట్లో

AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..
Pet Dog

Updated on: Feb 20, 2022 | 7:59 AM

సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ ఇంట్లో మనుషుల మాదిరిగానే వాటిని ప్రేమగా.. అప్యాయంగా ఆదరిస్తారు. తాము ఇష్టంగా పెంచుకున్న కుక్కలకు.. పిల్లులకు ఏం జరిగినా తట్టుకోలేరు. వాటికి చిన్న హాని కలిగిన వారి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అయితే ఓ వ్యక్తి తన కుక్క కోసం ఏకంగా ప్రాణాలు వదిలేశాడు. ఎంతో అప్యాయంగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోవడంతో.. కుక్కను వదల్లేక పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం దొమ్మేరులో ఉండే వరిగేటి శ్రీను ఓ కుక్కను తెచ్చుకుని ప్రేమగా పెంచుకుంటున్నాడు. దానితో వరిగేటి శ్రీను అనుబంధం రోజు రోజూకీ పెరిగిపోయింది. ఆ కుక్కు కూడా తన యాజమాని పట్ల ఎంతో విశ్వాసంతో.. ప్రేమగా ఉండేది. అయితే ఎంతో హుషారుగా.. తమతో ఎప్పుడూ ప్రేమగా.. నమ్మకంగా ఉండే పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా చనిపోయింది. దీంతో రోజూ తమతో ఉండే పెంపుడు కుక్క చనిపోవడంతో ఆ యాజమాని జీర్ణించుకోలేకపోయాడు. పెంపుడు కుక్కను విడిచి ఉండలేకు.. నీ వెంటే నేనంటూ ఈనెల 7న వరిగేటి శ్రీను తీవ్ర మానస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో వెంటనే అతడిని విశాఖలోని కేజీహెచ్‎కు తరలించగా..చికిత్స పొందతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..