Kurnool Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బుధవారం ఉదయం ఉలిందకొండ వద్ద బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి పలమనేరుకి వెళ్తున్న బస్సు ఎన్‌హెచ్44 హైవేపై ఉలిందకొండ వద్ద ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయాలైన ఏడుగురు ప్రయాణికులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉలిందకొండ పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: