వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని మాజీ వైస్ చాన్సలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పట్టపగలు అధికారి ఇంట్లో చొరబడ్డ దుండగులు అతన్ని దారుణంగా హతమార్చారు. కుటుంబీకులు ఆయన్ను ఆసుపత్రికి తరలించిన కాసేపటకే తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జార్సుగూడకు చెందిన ప్రొఫెసర్ ధూర్బరాజ్ నాయక్ సంబల్పూర్ యునివర్సిటీలో వైస్ చాన్సలర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా జూన్ 27 ఆదివారం ఊళ్లో నుంచి కొంతమంది యువకులు వచ్చి నాయక్ ఇంట్లోకి చొరబడ్డారు. పనిమీద బయటకు వెళ్లిన నాయక్ అంతలోనే ఇంటికి వచ్చారు… నాయక్‌ను చూసిన ఆ యువకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలంటూ అతనిపై దౌర్జన్యం చేశారు.
ఈ క్రమంలోనే నాయక్, ఆ యువకులు మధ్య తోపులాట జరిగింది. ఆ యువకుల్లో ఒక వ్యక్తి అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నాయక్ మెడపై నరికాడు. దీంతో నాయక్ అక్కడే కుప్పకూలిపోయారు. దుండగులు అక్కడినుంచి పారిపోయారు. కుటుంబీకులు హుటాహుటినా ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నాయక్ మరణించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు. కాగా కేవలం 100 రూపాయల కోసం ఒక మాజీ చాన్సులర్‌ను దారుణంగా చప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల