సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన.. పెళ్లైన మూడు రోజులకే పెళ్లికొడుకు మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు..

|

Mar 14, 2021 | 1:20 PM

Newly Married Man Deceased : సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మూడు రోజులకే ఓ యువకుడికి నూరేళ్లు నిండాయి. అనుకోని సంఘటన వల్ల ప్రాణాలను

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన.. పెళ్లైన మూడు రోజులకే పెళ్లికొడుకు మృతి..  విషాదంలో కుటుంబ సభ్యులు..
Died
Follow us on

Newly Married Man Deceased : సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మూడు రోజులకే ఓ యువకుడికి నూరేళ్లు నిండాయి. అనుకోని సంఘటన వల్ల ప్రాణాలను కోల్పోయాడు. దీంతో పెళ్లి కూతురు సహా ఇరు కటుంబ సభ్యలు విషాదంలో మునిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు. వారికి ఐదుగురు కుమారులు సంతానం. అందరితో కలిసి హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ అక్కడే నివసిస్తున్నారు.

అయితే చిన్న కుమారుడు యాసిన్‌ (23) కు పెళ్లి చేయాలని నిర్ణయించి బంధువుల అమ్మాయిని ఖాయం చేసుకొని గురువారం నగరంలో ఘనంగా పెళ్లి జరిపించారు. అంతేకాకుండా స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేశారు. అయితే ఇంతలోనే అనుకోని సంఘటన జరిగింది. అయితే ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరు కలిసి మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లి సరదాగా గడపసాగారు. వారితో పాటు యాసిన్ కూడా వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదవశాత్తు యాసిన్ అన్న కుమారుడు సమీర్‌ ఆడుకుంటూ చెరువులో పడిపోయాడు. మునుగుతూ కేకలు వేయడం యాసిన్‌ గమనించాడు. దీంతో వెంటనే యాసిన్‌ అతడిని కాపాడే యత్నం చేశాడు.

ఈ క్రమంలో బాలుడిని కాపాడినా.. యాసిన్ చెరువులోని గుంతలో ఇరుక్కుపోయాడు. చాలా సేపు శ్వాస ఆడలేదు. ఇంతలో గట్టున ఉన్న కొందరు సమీర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి గ్రామస్తులు అక్కడికి చేరుకొని యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో పెళ్లి కాస్త చావుతో ముగియడం వల్ల గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Telangana, AP MLC Elections 2021 Live : తెలుగురాష్ట్రాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

Hindupuram Election Results: హిందూపురంలో అనూహ్య పరిణామం.. వైసీపీ, టీడీపీకి పోటీగా దూసుకొచ్చిన మరో పార్టీ..

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా