వరంగల్ 9 హత్యల కేసులో కొత్త ట్విస్ట్

|

Jun 03, 2020 | 4:11 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల కేసు మిస్టరీని వరంగల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు..ఇంత మందిని హతమార్చేందుకు గాను..

వరంగల్ 9 హత్యల కేసులో కొత్త ట్విస్ట్
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల కేసు మిస్టరీని వరంగల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు. తొలుత చేసిన మహిళ హత్య నుంచి తప్పించుకోవడం కోసం నిందితుడు మరో 9 హత్యలు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, పెద్దమొత్తంలో నిద్రమాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు మాత్రం బయటపెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడు ఇదే అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలతో విడిపోయి 72 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు..ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ, నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరును కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులు కావాలనే షాపు పేరు తెలిసినా గోప్యంగా ఉంచుతున్నారా…లేదంటే నిజంగానే అతడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాప్‌ను పోలీసులు గుర్తించలేకపోయారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతకుడికి కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు..మందుల షాపు విషయంలో మాత్రం తాత్సరం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు నిందితుడు చెప్పాడని.. పోలీసులు గతంలోనే మీడియాకు వివరించారు. కానీ, ఆ షాపు పేరు బయటపెట్టలేదు. అయితే దీని వెనుక ఏమైన ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా..బయటకు వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.