YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఓ కొలిక్కి వచ్చిందనుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ అసలు పేరే వినిపించని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి.. ఇప్పుడు అరెస్ట్ కూడా అయ్యారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతించడంతో ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని గురువారం ఉదయం కడపకు తీసుకువచ్చారు. మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో సీబీఐ ఆయనను హాజరుపరచనుంది.
మరోవైపు, వివేకా హత్య కేసులో నిన్న హైదరాబాద్‌లో శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ- సీబీఐకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు శంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఈ లేఖలో రాశారు దేవిరెడ్డి – ఉద్దేశపూర్వకంగానే వివేకా కుమార్తె నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంతో.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రస్తావన రావడం, ఆయన్ను సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో మరో మలుపు తిరిగింది. శంకర్ రెడ్డి వైసీపీ నేత అంటూ టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడని ఆరోపిస్తోంది. మరోవైపు, శంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి సీబీఐకి రాసిన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపుతోంది. ఇంతకీ ఈ లేఖలో ఏముందంటే.. హత్యకు మూలకారణం ఏంటో, హత్య చేసిందెవరో సునీతకు తెలుసనీ.. సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, మరిది శివప్రకాష్‌రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మను సీబీఐ విచారించాలనీ డిమాండ్ చేశారు.మొత్తానికి కేసులో జరుగుతున్న కీలక పరిణామాలలో ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందనేది ఇప్పు ఆసక్తికరంగా మారింది.
Read Also… NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్ సానుభూతిపరులే టార్గెట్