మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి.. డిప్యూటీ మేనేజర్ సస్పెండ్..

| Edited By:

Jun 30, 2020 | 2:33 PM

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెల్లూరు టూరిజం ఆఫీసులో డిప్యూటీ మేనేజర్.. సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి ఉషారాణిపై రాడ్డుతో దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మాస్క్ పెట్టుకోమన్నందుకు దివ్యాంగురాలు అని చూడకుండా...

మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి.. డిప్యూటీ మేనేజర్ సస్పెండ్..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెల్లూరు టూరిజం ఆఫీసులో డిప్యూటీ మేనేజర్.. సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి ఉషారాణిపై రాడ్డుతో దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మాస్క్ పెట్టుకోమన్నందుకు దివ్యాంగురాలు అని చూడకుండా దాడికి పాల్పడ్డాడు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్ రావు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా డిప్యూటీ మేనేజర్‌ని మాస్క్ పెట్టుకోవాలని చెప్పింది ఉద్యోగి ఉషారాణి. అయితే దానికి కోపాధిక్రుడైన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు.. నన్ను మాస్క్ ధరించాలని అడుగుతావా అని అరుస్తూ.. ఉద్యోగిని టేబుల్ దగ్గరకు వెళ్లి పిడుగుద్దు గుద్దుతూ.. కింద పడేసి.. రాడ్డుతో విపరీతంగా కొట్టాడు. అక్కడున్న మిగతా ఉద్యోగులు కూడా భాస్కర్ రావును కంట్రోల్ చేయాలని చూసినా.. అతను మరింత క్రూరంగా ప్రవర్తించాడు. మొత్తానికి కొందరు ఉద్యోగులు భాస్కర్‌ రావును అడ్డుకున్నారు.

ఆ తర్వాత ఆ గాయాలతోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉద్యోగి ఉషారాణి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీటీడీసీ ఎండీ ప్రవీణ్ కుమార్.

Read More: ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..