Nellore GGH Superintendent: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌ అరాచకాలు నిజమే.. కమిటీ నివేదిక అధారంగా ప్రభాకర్‌పై బదిలీ వేటు

ఆడియో టేపులతో అడ్డంగా బుక్కైన సూపరింటెండెంట్‌ ఇష్యూపై విచారణ జరిపిన కమిటీలు.. వేధింపులకు గురి చేసినట్లుగా తేల్చారు.

Nellore GGH Superintendent: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌ అరాచకాలు నిజమే.. కమిటీ నివేదిక అధారంగా ప్రభాకర్‌పై బదిలీ వేటు
Nellore Ggh Superintendent Prabhakar Transfer
Follow us

|

Updated on: Jun 05, 2021 | 7:04 PM

Nellore GGH Superintendent Prabhkar: ఆయన వెకిలి వేషాలు, స్టూడెంట్స్‌ని వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని నిర్ధారణ అయ్యింది. ఆడియో టేపులతో అడ్డంగా బుక్కైన సూపరింటెండెంట్‌ ఇష్యూపై విచారణ జరిపిన కమిటీలు.. వేధింపులకు గురి చేసినట్లుగా తేల్చారు.  దీంతో ఆయనపై బదిలీ వేటు వేసింది ఏపీ రాష్ట్ర సర్కార్.

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ హౌస్‌ సర్జన్‌ పక్కా ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చింది. నిజంగా ప్రభాకర్‌ ప్రవర్తన బాధితురాలు చెప్పినట్లుగానే ఉందా? లేక ఆరోపణలా అనే విషయాన్ని తేల్చడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కమిటీ బాధితురాలు బయటపెట్టిన ఆడియో టేపులతో పాటు పూర్తి వివరాలతో ఓ నివేదికను తయారు చేసింది. సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ నిజంగానే వేధింపులకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ప్రభాకర్‌ను నెల్లూరు జీజీహెచ్‌ నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ చేశారు.

నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ హౌస్‌ సర్జన్‌ని వేధింపులకు గురి చేశాడు. ఇదే విషయాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు సూపరింటెండెంట్‌ని ఫోన్‌లో కడిగిపారేసింది. సూపరింటెండెంట్‌ హోదాను అడ్డుపెట్టుకొని ప్రభాకర్‌ తరచూ యువతికి ఫోన్ చేసి మానసికంగా వేధించడంతో విసిగిపోయిన బాధితురాలు ఫోన్‌లోనే అతడికి బుద్ధి చెప్పిన ఆడియో వాయిస్ బయటకు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలి పక్షాన అండగా నిలిచిన మహిళా కమిషన్ సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఇందుకోసం విచారణ కమిటీని వేశారు. కమిటీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ వేధింపుల వ్యవహారం వాస్తవమేనని తేల్చడంతో .. తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also…  Somireddy vs Kakani: టీడీపీ నేత సోమిరెడ్డికి ఎమ్మెల్యే కాకాని సవాల్‌… తప్పు నిరూపిస్తే ఉరేసుకునేందుకు సిద్ధంః గోవర్ధన్‌రెడ్డి

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్