ఆర్యన్‌ఖాన్ చుట్టూ ఉచ్చు ఉచ్చు బిగుస్తోంది. నిన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఆర్యన్‌కు చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..మూడ్రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 7 వరకు ఎన్సీబీ కస్టడీలోనే ఉండనున్నాడు ఆర్యన్ ఖాన్. ఇక ఆర్యన్ స్నేహితుడు శ్రేయస్‌ను కూడా అదుపులోకి తీసుకుంది NCB.
మరోవైపు క్రూయిజ్‌లో భారీగా డ్రగ్స్ దొరకడంతో ఈ కేసులో అరెస్టైన వారి ఇళ్లపైనా దాడులు చేసింది ఎన్సీబీ. నిన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తును స్పీడప్ చేసిన ఎన్సీబీ..డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి..? దీని వెనుక ఎవరెవరున్నారు..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..
PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..