నకిలీ విత్తనాల రాకెట్ గుట్టు రట్టు

|

Jun 23, 2020 | 4:32 PM

అంతర్ రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టు రట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. 30 లక్షల విలువైన 15 క్విటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

నకిలీ విత్తనాల రాకెట్ గుట్టు రట్టు
Follow us on

అంతర్ రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టు రట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. వివిధ చోట్ల పోలీసులు దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 30 లక్షల విలువైన 15 క్విటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించి 23 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని, పరారీలో మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగు విత్తనాల ప్యాకెట్ల అధారంగా కేసును చేధించామన్న రంగనాథ్.. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దరని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే వాడాలన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల కేంద్రంగా నకిలీ విత్తనాల దందా సాగుతున్నట్లు గుర్తించామని ఎస్పీ వివరించారు. గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని చండూర్, మునుగోడు, నకిరేకల్, గుర్రంపోడు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ విత్తనాలతో పాటు తయారీ మిషనరీ, ప్యాకింగ్ మిషన్స్, కాంటాలు, కార్లు, ఆటో, సెల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ.. త్వరలో పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.