Woman Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. మహిళా రైతు దారుణ హత్య.. ముగ్గురికి తీవ్ర గాయాలు

|

Jan 06, 2021 | 11:36 PM

Woman Murder:చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మెదురుకుప్పం మండలం ఎగువకనకాపురంలో మహిళా రైతు చంద్రకళ దారుణ హత్యకు గురైంది. దాడి చేసిన దుండగులు ...

Woman Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. మహిళా రైతు దారుణ హత్య.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Follow us on

Woman Murder: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మెదురుకుప్పం మండలం ఎగువకనకాపురంలో మహిళా రైతు చంద్రకళ దారుణ హత్యకు గురైంది. దాడి చేసిన దుండగులు కళ్లల్లో కారం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి, ఉష, సరస్వతిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాల మధ్య కొంత కాలంగా భూవివాదం ఉందని, అందుకే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే చంద్రకళను హత్య చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Guntur GGH Fire Accident: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు