Boy crushed to death in Lift: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మలాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం మలాద్ హౌసింగ్ సొసైటీలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. రిపేర్‌లో ఉన్న లిఫ్ట్‌లో చిక్కుకుని 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత మలాద్ పోలీసులు లిఫ్ట్ మెకానిక్ వివేక్ పాండే (37)ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అథర్వ శర్మ (11) తన అన్నయ్య కౌశిక్‌తో కలిసి గోరేగావ్‌లోని తన తాత ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. సాయంత్రం 5.35 గంటల సమయంలో మలాద్‌లోని చించోలి రోడ్‌లోని కావేరీ సొసైటీలోని ఏడు అంతస్తుల భవనంలోకి ప్రవేశించారు. లిఫ్ట్ మెయింటెనెన్స్ వర్క్ గురించి తెలియక అధర్వ లిఫ్ట్ డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టాడు. అంతే.. లిఫ్ట్ డోర్ వేయకుండానే అతన్ని పైకి లాక్కొని వెళ్లింది. దీంతో అధర్వ డోర్ వేకి, లిఫ్ట్ కిందికి మధ్య ఇరుక్కుపోయాడు. అతడిని రక్షించేందుకు సోదరుడు ప్రయత్నించినప్పటికీ.. లాభం లేకుండా పోయింది.
ఇద్దరు సోదరుల అరుపులు విని సొసైటీ వాచ్‌మెన్ బాలుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికప్పుడు మెకానిక్‌ను అప్రమత్తం చేసి వెంటనే పనిని ఆపమని కోరాడు. అనంతరం శరీరం మొత్తం ఛిద్రమై.. తీవ్రగాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అధర్వను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే అధర్వ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. అధర్వ కుటుంబం మూడో ఫ్లోర్‌లో నివసిస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకొని.. అధర్వ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో ఈ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
కాగా.. లిఫ్ట్ రిపేర్‌మెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని.. దీంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లిఫ్ట్ రిపేర్‌లో ఉందని దానిని యాక్సెస్ చేయవద్దని పోలీసులు సూచించారు. అనంతరం మరమ్మతులు చేస్తున్న వివేక్ పాండేను అరెస్టు చేశారు. అనంతరం అధర్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
Also Read: