Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.. చిక్కుకున్న జనాలు!

Fire Accident:  ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్‌బాగ్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో ఈ అగ్ని..

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.. చిక్కుకున్న జనాలు!

Updated on: Oct 22, 2021 | 1:36 PM

Fire Accident:  ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్‌బాగ్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో కొద్దిసేపటి క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే 19 అంతస్తులున్న ఈ భవనంలో 3వ అంతస్తులు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సంభవించగానే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి మంటల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయగా, అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇతర అంతస్తుల్లో చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి భారీగా అగ్నిమాపక శకటాలను రప్పిస్తున్నారు అధికారులు. అయితే ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

ఈ ప్రమాదం కారణంగా కర్రీ రోడ్‌ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలను సైతం పోలీసులు నిలిపివేశారు. ఘటన స్థలానికి ముంబై మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌, పోలీసులు, అధికారులు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలిక సహా 8 మంది దుర్మరణం.. ఘటన స్థలానికి పోలీసులు..!

Anantapur Crime: విషాదాంతమైన మూడు నెలల చిన్నారి మిస్సింగ్ కేసు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే..