హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు

|

Jul 10, 2020 | 4:26 PM

నరసాపురం సొంతపార్టీ వైసీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సొంతపార్టీ నేతలే కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ హైకోర్టులో రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు
Follow us on

నరసాపురం సొంతపార్టీ వైసీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సొంతపార్టీ నేతలే కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ హైకోర్టులో రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. భీమవరం, పోడూరు స్టేషన్లలో తనపై నమోదైన కేసులపై హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లలో పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుయాపరి విచారణను వాయిదా వేసింది.

ఎంపీపై పోడూరు స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను దుర్భాషలాడారని పేర్కొంటూ గ్రంధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో పోలీసు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించాడు.