తల్లితో కలిసి తండ్రిని చంపి పాతిపెట్టిన తనయుడు

|

Sep 24, 2020 | 6:26 PM

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తల్లితో గొడవ పడుతున్నాడంటూ తండ్రిని హతమార్చాడు కన్నకొడుకు. తండ్రిని హత్య చేసేందుకు తల్లి కూడా అతనికి సహకరించింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం కలిగించింది.

తల్లితో కలిసి తండ్రిని చంపి పాతిపెట్టిన తనయుడు
Follow us on

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తల్లితో గొడవ పడుతున్నాడంటూ తండ్రిని హతమార్చాడు కన్నకొడుకు. తండ్రిని హత్య చేసేందుకు తల్లి కూడా అతనికి సహకరించింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం కలిగించింది. చేవెళ్ళ మండలం లోని గుండాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.. గుండాల గ్రామానికి సాలే కిష్టయ్య 45 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని జాడ కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యలు అనుమానం రాకుండా వ్యవహరించారు. 45 రోజుల తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా గురువారం కిష్టయ్య కొడుకు రమేష్ ను నిలదీయగా తన తండ్రి అయిన కిష్టయ్యను తల్లి లలిత తో కలిసి తానే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహన్ని ఎవరికి అనుమానం రాకుండా తమ పొలంలో పాతి పెట్టమని వెల్లడించారు. దీంతో పోలీసులు శవాన్ని పూడ్చిపెట్టి ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు చేవెళ్ల పోలీసులు.