కిరోసిన్ పోసుకొని తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన పెను ప్రమాదం..

|

Nov 29, 2020 | 8:51 AM

ఒడిశా రాష్ట్రంలోని అసెంబ్లీ ఎదుట ఓ తల్లీ కొడుకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా అసెంబ్లీ పరిసరాల్లోని ఐజీ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

కిరోసిన్ పోసుకొని తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన పెను ప్రమాదం..
Follow us on

ఒడిశా రాష్ట్రంలోని అసెంబ్లీ ఎదుట ఓ తల్లీ కొడుకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా అసెంబ్లీ పరిసరాల్లోని ఐజీ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని కుజాంగ్‌కు చెందిన సులోచన దాస్‌కు ఇద్దరు కుమారులు. అయితే అందులో ఓ కుమారుడు ఇటీవల హత్య చేయబడ్డాడు. పోలీసులు ఈ కేసును మొదటగా అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసినా తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కేసు క్లోజ్ చేశారు. అయితే తన కొడుకును 10 మంది దారుణంగా కలిసి హత్య చేశారని అందులో డీఎస్పీ కొడుకు కూడా ఉన్నాడని అందుకే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా కేసు గురించి అడిగితే పోలీసులు మాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెబుతోంది. ఈ విషయమై తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని మరో కొడుకుతో కలిసి అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నంచింది. అలాగే గత రెండు రోజుల కిందట కూడా కటక్ జిల్లాకు చెందిన ముగ్గురు రైతులు కూడా అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. నాయఘర్ జిల్లాలో హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు కూడా అసెంబ్లీ ముందు ఆత్మహత్యకు యత్నించారు. నిందితుడు అధికారి పార్టీ నాయకుడి సహాయకుడు కావడంతో పోలీసులు అతడిని రక్షిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ శీతకాల సమావేశాలు జరుగుతున్న వేళ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో అసెంబ్లీ సమీపంలో రెండు ఆత్మహత్యా యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.