
Mother childrens Dead: తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం నెలకొంది. ఓ తల్లి.. ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి చెందింది. ఓ చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. చీర ఉచ్చు మెడ నుంచి జారడంతో ఆ చిన్నారి తప్పించుకుంది. ఈ ఘటన చౌటప్పల్‌లోని రామ్‌నగర్‌లో జరిగింది. రామ్ నగర్‌కు చెందిన వెంకటేశ్, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సమతమతమవుతోంది. ఓ వైపు కుటుంబాన్ని పోషించడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో రాణి మానసికంగా కుంగిపోయింది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. చిన్న కుమార్తె శైనీ మెడ నుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణి (31) తోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి (13), లక్కీ (11) ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: