Brutal Murder: మంచిర్యాలలో డబుల్ మర్డర్… తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Brutally Murdered: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు..

Brutal Murder: మంచిర్యాలలో డబుల్ మర్డర్... తల్లీ కూతుళ్ల దారుణ హత్య
murder

Updated on: Jun 18, 2021 | 4:36 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పూదారి విజయలక్ష్మి(47), రవీనా (23) దారుణ హత్యకు గురయ్యారు. తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అల్లుడిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలతో భర్తకు దూరంగా రవీనా ఉంటోంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. బృందావ‌న్ కాల‌నీలో శుక్రవారం ఉదయం ఈ జంట హత్యలు జరిగాయి. త‌ల్లీ, కుమార్తె హ‌త్యకు గుర‌య్యారు. కుటుంబ క‌ల‌హాల‌ నేపథ్యంలో అత్త విజ‌య‌ల‌క్ష్మీ, భార్య ప్రవీణ‌ను అల్లుడే హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ‌తంలో అల్లుడిపై వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు నులిమి వీరిని చంపిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం విజయలక్ష్మి, ప్రవీణ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

CJI NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు..

CM Mamata: పంతం వీడని మమతా…సువేందు అధికారి గెలుపుపై కలకత్తా హైకోర్టులో పిటిషన్..

Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన

AP Job Calendar: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

Follow Us