Hyderabad: సినిమా స్టైల్లో, మూవీ షూటింగ్ స్పాట్ వద్ద ఛీటింగ్.. అందరి ముందే కమ్మేశారు

|

Aug 12, 2021 | 3:22 PM

ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న చోట సినీ ఫక్కీలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారు కొందరు కేటుగాళ్లు. సినిమా షూటింగ్‌కు...

Hyderabad: సినిమా స్టైల్లో, మూవీ షూటింగ్ స్పాట్ వద్ద ఛీటింగ్.. అందరి ముందే కమ్మేశారు
Movie Shooting
Follow us on

ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న చోట సినీ ఫక్కీలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారు కొందరు కేటుగాళ్లు. సినిమా షూటింగ్‌కు ఇక్కడ అనుమతి లేదని వక్ఫ్ బోర్డ్‌ అనుమతి తీసుకోవాలని బెదిరించారు. వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ మాదిరిగా మాట్లాడి 50 వేలు వసూలు చేశారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. వాళ్లకు వక్ఫ్‌ బోర్డుతో సంబంధం లేదని తేలింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ఉన్న ల్యాంకో హిల్స్‌ దగ్గర డైరెక్టర్‌ శ్రీను తన టీమ్‌తో ఓ సినిమా షూటింగ్‌ చేస్తున్నాడు. అయితే హఠాత్తుగా అక్కడికి వచ్చిన కొందరు యూట్యూబ్‌ ఛానల్‌ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. ఇక్కడ షూటింగ్‌కు అనుమతి ఎవరిచ్చారని నిర్మాతను ప్రశ్నించారు. తాము పోలీసుల పర్మిషన్‌ తీసుకున్నామని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసుల అనుమతి కాదు.. స్థలం యజమాని అనుమతి కావాలని.. వక్ఫ్‌బోర్డ్‌ అనుమతి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ సలీమ్‌ మనుషులమని చెప్పారు. సలీమ్‌తో మాట్లాడించినట్టు ఫోన్‌లో ఎవరితోనే మాట్లాడించారు. 4 లక్షల వరకు డిమాండ్‌ చేసి, చివరికి 50 వేలకు బేరం కుదుర్చుకుని 50 వేలు వసూలు చేశారు.

దీనిపై బాధితుడు నార్సింగి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయట పడింది. అసలు తాను ఎవరితో ఫోన్‌లో మాట్లాడలేదని, దీనికి తనకు సంబంధం లేదని వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ సలీం తెలిపారు. దీంతో చీటింగ్‌ చేసి 50 వేలు ఎత్తుకెళ్లిన మోసగాళ్ల కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. ల్యాంకో హిల్స్‌ గుట్టపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Also Read: టీచర్ కాదు పర్వర్ట్.. తన వద్ద చదువుకునే బాలికలను ట్రాప్ చేసి ఆకృత్యాలు… ఒకరిద్దరు కాదు

హైదరాబాదీలు బీ అలెర్ట్.. కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి