జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు…సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై అనూహ్యంగా కాల్పులు..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూలోని చనపోరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

  • Rajeev Rayala
  • Publish Date - 8:57 pm, Sat, 6 February 21
జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు...సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై అనూహ్యంగా కాల్పులు..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూలోని చనపోరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. శనివారం అనూహ్యంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ కానిస్టేబుల్‌ గాయాపడ్డాడని పారామిలిటరీ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

చనపోర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ 29వ బెటాలియన్‌కు చెందిన రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ (ఆర్‌ఓపీ)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సీఆర్పీఎఫ్‌ అధికారి పేర్కొన్నారు. దాడి సమయంలో కానిస్టేబుల్‌ కుమార్‌ యాదవ్‌ కాలికి గాయమైందని, దాంతో అతడిని  వెంటనే హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతుందని సీఆర్పీఎఫ్‌ అధికారి వివరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mohanlal’s Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా ‘దృశ్యం 2’ ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి…