Crime: అమానుషం.. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

Mentally challenged woman: దేశంలో నిర్భయా లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కామాంధులు రోజురోజుకు క్రూర జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా

Crime: అమానుషం.. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..
woman Raped

Updated on: Jul 11, 2021 | 8:16 AM

Mentally challenged woman: దేశంలో నిర్భయా లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కామాంధులు రోజురోజుకు క్రూర జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ మతిస్థిమితం లేని మహిళపై (30) ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మైసూరులోని కేఆర్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దేవరాజా పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వారంక్రితం రాత్రివేళ కిటికీ గ్రిల్స్‌ విరగ్గొట్టి కేఆర్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళా వార్డులోకి ప్రవేశించాడు. అనంతరం నిస్సహాయ మహిళపై ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ విషయాన్ని ఆమె బంధువులు.. వైద్యుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదు. దీంతో వారు చేసేదేమీ లేక మానవ హక్కుల సేవా సమితి సభ్యులను సంప్రదించారు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరంలోని దేవరాజా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె చెలువాంబ ప్రత్యేక సంరక్షణ విభాగానికి తరలించారు. కాగా.. బాధితురాలు చాలా నెలలుగా ఆసుపత్రిలోని నిరాశ్రయులైన వార్డులో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై మైసూరు డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ గుంతి మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సెక్యూరిటీ, సిబ్బంది కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read:

Kathi Mahesh Death: స్వస్థలానికి కత్తి మహేశ్ మృతదేహం తరలింపు.. నేడు అంత్యక్రియలు..

Zodiac Signs : ఈ 3 రాశులవారు ఖరీదైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు..! మీరు ఇందులో ఉన్నారా..?