కీసర కేసులో మరోమలుపు.. ప‌ట్టా పాసు పుస్త‌కాలు ర‌ద్దు

|

Sep 05, 2020 | 1:43 PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క‌లెక్ట‌ర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కీస‌ర రెవెన్యూ ప‌రిధిలో తాసిల్దార్ ‌నాగ‌రాజు జారీ చేసిన ప‌ట్టా పాసు పుస్త‌కాలు ర‌ద్దు చేస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు ఆదేశాలు జారీ చేశారు. ప‌ట్టా పాసుపుస్త‌కాలు ర‌ద్దు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌లెక్ట‌ర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కీసర కేసులో మరోమలుపు.. ప‌ట్టా పాసు పుస్త‌కాలు ర‌ద్దు
Follow us on

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క‌లెక్ట‌ర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కీస‌ర రెవెన్యూ ప‌రిధిలో తాసిల్దార్ ‌నాగ‌రాజు జారీ చేసిన ప‌ట్టా పాసు పుస్త‌కాలు ర‌ద్దు చేస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు ఆదేశాలు జారీ చేశారు. ప‌ట్టా పాసుపుస్త‌కాలు ర‌ద్దు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌లెక్ట‌ర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్‌, అంజిరెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజాగా మరికొందరు రెవెన్యూ అధికారుల పేర్లు బయటకు వస్తున్నాయి. కీసర కేసులో వరంగల్ జిల్లా ఉన్నతస్థాయి అధికారికి కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నాగరాజు ఏసీబీ అధికారుల విచారణలో తన వాంగ్మూలంలో ప్రస్తావించినట్టు ఏసీబీ ఇంటరాగేషన్‌ రిపోర్టును బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు చెప్పగా.. తనకేమీ తెలియదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆర్డీవో రవి చెప్తున్నారు.