డిక్కీలో డెడ్‌బాడీ ఎవరిది..? కారు ఓనర్‌దా..? లేదంటే యజమాని కన్నుగప్పి కారుని తీసుకెళ్లి హత్యకు ఉపయోగించారా..? మంటల్లో కాల్చివేస్తే ఆధారాలు దొరకవని భావించారా..? అసలేం జరిగింది..? మెదక్ జిల్లా మంగళపర్తిగ్రామ శివారులో కారు దగ్ధం కేసులో ఇలాంటి అనుమానాలెన్నో తెరమీదకు వస్తున్నాయి. కారు మంటలకు ఆహుతైంది.. ఒకరు సజీవంగా దహనమయ్యారు. కానీ ఎవరు కాల్చారు..? ఎందుకు నిప్పు పెట్టారన్నది మాత్రం మిస్టరీగా మారింది. అర్దరాత్రి కారుకి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు. గమనించిన గ్రామ సర్పంచ్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకునేలోపే మంటల ఆరిపోయాయి. కారుని పరిశీలిస్తే.. ముందు సీట్లో వెనక సీట్లో ఎవరూ లేరు. కానీ డిక్కీలో మాత్రం కాలిపోయిన డెడ్‌బాడీ కనిపించింది. అందరూ షాకయ్యారు. సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తుంటే కచ్చితంగా హత్యేనని తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం.. చంపేసి, ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో కుక్కేసి.. కారు మొత్తానికి నిప్పు పెట్టినట్టుగా అర్థమవుతోంది.
మంటల్లో కాలిబూడిదైన కారును పోలీసులు గుర్తించారు. TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ ఉన్న హోండా సివిక్ కారు శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. కానీ ఇప్పటిదాకా శ్రీనివాస్ బయటకు రాలేదు. కారు నెంబర్ ఆధారంగా ఓనర్ పేరు గుర్తించారు. కానీ అందులో దహమైన వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. డిక్కీలో డెడ్‌బాడీ ఎవరిదన్నదే అంతుపట్టకుండా మారింది.
కారు దగ్ధమైంది.. ఒకరు దహనమయ్యారు.. ఈ ఘటనలో చాలా సందేహాలు తెరమీదు వస్తున్నాయి. జరిగింది హత్యేనన్నది అందరి అనుమానం. పక్కా పథకం ప్రకారం చంపినట్టు స్పష్టమవుతోంది. మంటల వెనుక మిస్టరీ తేలాలంటే ముందుగా చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అతనెవరో తెలిస్తే ఫైర్ ఎపిసోడ్ వెనుక ఫ్యాక్ట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మెదక్ జిల్లాలో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా.. మంగళపర్తి శివారు ప్రాంతాల్లో ఎవరైనా కనిపించడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…