తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో విషం తాగి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా మారుతీరావు గురించి ఆర్య వైశ్య భవన్ మేనేజర్ మల్లికార్జున్ పలు విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా మారుతీ రావు ఇక్కడే ఉండేవాడని.. ఆయన కుమార్తె చదువుకునే సమయంలోనూ చాలాసార్లు ఇక్కడికి వచ్చేవాడని మల్లికార్జున్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్య వైశ్య భవన్‌లో మారుతీ రావును ఆయన డ్రైవర్ వచ్చి వదిలి వెళ్లారని ఆయన చెప్పారు. ఉదయం 8గంటలకు డోర్ తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించామని.. పోలీసులతో పాటు మారుతీ రావు వ్యక్తిగత డ్రైవర్‌కు కూడా సమాచారం ఇచ్చామని మల్లికార్జున్ పేర్కొన్నారు. పోలీసులు వచ్చి చూసే సరికి మారుతీ రావు బెడ్‌పై పడి ఉన్నాడని.. ఆయన రూమ్‌లో పాయిజన్ బాటిల్ దొరికిందని వెల్లడించారు. సూసైడ్ నోట్‌లో తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో అని రాసి ఉందన్న విషయాన్ని మల్లికార్జున్ తెలిపారు. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావుకు ఆరు నెలల క్రితమే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
Read This Story Also: చెర్రీకి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ.. ఆ డైరక్టర్‌తో మూవీ ఫిక్స్..!