Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

Ram Charan: చెర్రీకి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ.. ఆ డైరక్టర్‌తో మూవీ ఫిక్స్..!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న రామ్ చరణ్.. తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు చెర్రీ ఎవరి దర్శకత్వంలో నటిస్తారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Charan next movie gossips, Ram Charan: చెర్రీకి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ.. ఆ డైరక్టర్‌తో మూవీ ఫిక్స్..!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న రామ్ చరణ్.. తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు చెర్రీ ఎవరి దర్శకత్వంలో నటిస్తారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురి దర్శకుల పేర్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వినిపించాయి. కొరటాల శివ, గౌతమ్ తిన్ననూరి, సుజీత్‌తో పాటు మరో కొత్త దర్శకుడి పేరు ఈ లిస్ట్‌లో వినిపించింది. ఇదిలా ఉంటే వీరందరిలో చెర్రీ, గౌతమ్ తిన్ననూరికే ఓటేసినట్లు తెలుస్తోంది. ఇటీవల గౌతమ్, చెర్రీకి ఓ లవ్‌స్టోరీని వినిపించారట.

ఆ స్టోరీ ఓ ఆంధ్ర అబ్బాయికి, పంజాబీ అమ్మాయికి మధ్య జరగనుందట. ఇక ఈ కథను విన్న చెర్రీ.. చాలా ఇంప్రెస్ అయ్యారట. ఆరెంజ్ తరువాత ఇంతవరకు లవ్‌ స్టోరీని చేయని చెర్రీ.. ఈ స్టోరీకి చాలా ఫిదా అయ్యారట. ఈ క్రమంలో కచ్చితంగా చేస్తానని గౌతమ్‌కు మాట ఇచ్చారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మరో క్రేజీ కాంబో టాలీవుడ్‌లో రాబోతోంది. కాగా గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో జెర్సీ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. షాహిద్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌పై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: బిగ్ బ్రేకింగ్.. ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

Related Tags