Maoist Bandh Call – Jagan: ములుగు జిల్లా టేకులగూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించినట్టుగా జగన్ తెలిపారు.
ములుగు జిల్లా టేకులగూడ బోగస్ ఎన్ కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 27న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. అమాయకులని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తెలంగాణలోని ములుగు జిల్లాలోని టేకులగూడ అటవీప్రాంతలో నిన్న(ఆదివారం) జరిగింది ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక ద్రోహి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడం కారణంగానే ఎన్ కౌంటర్ జరిగిందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను తెలంగాణ ప్రభుత్వం చంపుతోందని ఆయన అన్నారు. ఈ భూటకపు ఎన్ కౌంటర్లకు నిరసగా ఈ నెల 27న బంద్ కు పిలుపు నిచ్చినట్టు మావోయిస్టు పార్టీ పేర్కొంది. తెలంగాణ లో ఎన్ కౌంటర్ లు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. భూటకపు ఏన్ కౌంటర్ లతో రక్తపు టేరులు పారిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలనను సాగిస్తున్న కేసీఆర్..ఉద్యమకారుల పై అణిచి వేత కొనసాగిస్తున్నారని ఆయన తన లేఖలో విమర్శించారు.
Read also: KTR: జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానమిది: కేటీఆర్