యువతిని వేధిస్తున్న ఆకతాయి.. వీపు విమానం మోత మోగించిన స్థానికులు

చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఆకతాయిల తీరు మాత్రం మారడం లేదు. ఒంటరిగా యువతులు కనిపిస్తే చాలు.. ఈవ్ టీజింగ్‌కు దిగుతున్నారు. అయితే వీరి ఆటలకు చెక్ పెట్టారు కామారెడ్డి జిల్లా స్థానికులు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. టైలరింగ్‌ నేర్చుకుంటున్న ఓ యువతిని.. బీర్కూర్‌ మండలం బైరాపూర్‌కు చెందిన ఆకతాయి తరచూ వేధించసాగాడు. అయితే అతడికి ఎలాగైన బద్ది చెప్పాలనుకున్న యువతి.. విషయాన్ని ఇంట్లో […]

యువతిని వేధిస్తున్న ఆకతాయి.. వీపు విమానం మోత మోగించిన స్థానికులు

Edited By:

Updated on: Jan 04, 2020 | 5:14 AM

చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఆకతాయిల తీరు మాత్రం మారడం లేదు. ఒంటరిగా యువతులు కనిపిస్తే చాలు.. ఈవ్ టీజింగ్‌కు దిగుతున్నారు. అయితే వీరి ఆటలకు చెక్ పెట్టారు కామారెడ్డి జిల్లా స్థానికులు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. టైలరింగ్‌ నేర్చుకుంటున్న ఓ యువతిని.. బీర్కూర్‌ మండలం బైరాపూర్‌కు చెందిన ఆకతాయి తరచూ వేధించసాగాడు. అయితే అతడికి ఎలాగైన బద్ది చెప్పాలనుకున్న యువతి.. విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో పక్కా ప్లాన్ వేసి వాడిని.. ఫోన్‌లో బాన్సువాడ అంబేద్కర్‌ చౌరస్తాకు రప్పించింది. అక్కడి వచ్చాకా వాడిని యువతి బంధువులు, స్థానికులు చెప్పులతో చితక బాదుతూ.. వీపు విమానం మోత మోగించారు. నడిరోడ్డుపై ఉతికి ఆరేశారు. ఎట్టకేలకు బతుకు జీవుడా అంటూ పోకిరీ తప్పించుకు పారిపోయాడు. అనంతరం బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.