Crime News: వీడు మహాముదురు.! ఏడో తరగతి తెలివితో ఏకంగా ప్రొక్లైనర్‌ను ఎత్తుకెళ్లాడు.. చివరికి..

|

Nov 10, 2021 | 10:25 AM

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ చోరీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని రంగంపేటలో ఓ దొంగోడు ఏకంగా..

Crime News: వీడు మహాముదురు.! ఏడో తరగతి తెలివితో ఏకంగా ప్రొక్లైనర్‌ను ఎత్తుకెళ్లాడు.. చివరికి..
Crime
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ చోరీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని రంగంపేటలో ఓ దొంగోడు ఏకంగా భారీ ప్రొక్లైనర్‌ను ఎత్తుకెళ్లిపోయాడు. కాగా, కేసు విచారణ చేపట్టిన పోలీసులు విస్తూ పోయే విషయాలు వెల్లడించారు. చదివింది ఏడో తరగతి.. ప్రొక్లెన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడు.

తను ఆపరేట్‌ చేస్తున్న ఎక్స్‌ 200 మిషన్‌ను దొంగిలించి ఉడాయించాడు. అనపర్తి మండలం దుప్పలపూడిలో మిషన్‌ కిరాయి కూడా కుదుర్చుకున్నాడు. ఆగష్టులో జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నిందితుడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతన్ని పట్టుకోగలిగారు. అతని వద్దనుంచి ప్రొక్లెనర్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.

Also Read:

అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!

ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!