Gun Firing: కార్మికులపై యజమాని కాల్పులు.. కొడుకు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. అసలు ఏం జరిగింది..

|

Oct 06, 2021 | 5:17 PM

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ఉద్యోగుల మీద కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఓ బల్లెట్ అతడి కొడకుకు తాకింది. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది..

Gun Firing: కార్మికులపై యజమాని కాల్పులు.. కొడుకు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. అసలు ఏం జరిగింది..
Fire
Follow us on

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ఉద్యోగుల మీద కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఓ బల్లెట్ అతడి కొడకుకు తాకింది. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మంగళూరు దక్షిణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్గాన్స్ గేట్‌లో వైష్ణవి ఎక్స్‌ప్రెస్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ యజమాని రాజేష్ ప్రభు తన లైసెన్స్‌డ్ పిస్టల్‌ని ఉపయోగించి తన ఇద్దరు కార్మికులపై కాల్పులు జరిపారు. అయితే ఒక బుల్లెట్ ప్రమాదవశాత్తు 10వ తరగతి చదువుతున్న అతని కుమారుడిని తాకింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చంద్రు, అష్రఫ్ అనే ఇద్దరు సంస్థ గూడ్స్ క్యారియర్‌లో డ్రైవర్, క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వారికి రావాల్సిన వేతనం రూ.4000 గురించి వారు రాజేష్ ప్రభు భార్యను అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగింది. ఇదీ చూసిన ప్రభు 16 ఏళ్ల కొడుకు కోపంగా అక్కడికి వచ్చాడు. వచ్చిరాగానే చంద్రు, అష్రఫ్‎లో ఒకరిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో గొడవ ఘర్షణకు దారితీసింది. అప్పుడే వచ్చిన ప్రభు తన లైసెన్స్ గన్‎తో ఇద్దరు కార్మికులపై ఫైరింగ్ చేశారు. ప్రభు రెండు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ కొడుకు తలలోకి దూసుకెళ్లిందని వెల్లండిచారు. తలలోకి ఎనిమిది అంగుళాలు తీసుకెళ్లినట్లు వైద్యులు చెప్పారని వివరించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also.. తల్లిని క్రూరంగా సుత్తితో 14 సార్లు కొట్టి చంపాడు.. ఆపై తప్పించుకునేందుకు షాకింగ్ ప్లాన్