అదనపు కట్నం దాహానికి బలైన మహిళ.. కొట్టి చంపి కరోనా చనిపోయిందంటున్నారంటూ..

|

Jun 04, 2021 | 6:10 AM

కట్నం కాటుకు తనకూతురు తన భర్త చేతిలో హతమై పోయిందని మృతురాలి తల్లి దండ్రులు కుమార్తె మృత దేహం వద్ద తల్లడిల్లిపోయారు.

అదనపు కట్నం దాహానికి బలైన మహిళ.. కొట్టి చంపి కరోనా చనిపోయిందంటున్నారంటూ..
Death
Follow us on

కట్నం కాటుకు తనకూతురు తన భర్త చేతిలో హతమై పోయిందని మృతురాలి తల్లి దండ్రులు కుమార్తె మృత దేహం వద్ద తల్లడిల్లిపోయారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో చోటుచేసుకుంది.  వివాహ సమయం లో కట్నంగా ఇచ్చి న 60 సెంట్లు భూమి 6 లక్షల రూపాయల కట్నం చాలలేదని అదనంగా భూమితో బాటు మరికొంత డబ్బు కావాలని నాకూతురిని వేధించి చివరకు నా అల్లుడే నాకుమార్తెను హత్య చేసి కోవిడ్ తో చనిపోయిందని చెప్పడం చాలా భాదనిపిస్తుందని మృతురాలి తండ్రి వాపోతున్నారు. నిజంగా కోవిడ్ సోకితే మృత దేహాన్ని మార్చ్యు రీకి ఎందుకు తరలించారని అంటున్నారు . ఇంటి దగ్గరే కొట్టి చంపి అంబులెన్స్ లకు ఫోన్ చేస్తే కొట్టి చంపేసారని తెలుసుకుని రెండు అంబులెన్స్ ల డ్రైవర్ లు మాకొద్దు ఈ కిరాయి అని వెనుదిరిగి వెళ్లిపోయారని, మూడో అంబులెన్స్ కి కిరాయి పెంచి మృతదేహానికి చికిత్స చేయాలని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తే  అప్పటికే మృతి చెందింది నిర్దారించి పోస్ట్ మార్టం కొరకు మార్చ్యు రీకి తరలించారని మృతురాలి బంధువులు ఆరోపించారు.

కన్నా బిడ్డ పోయి మేముంటే ఒక కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని మృతురాలి బంధువులు ఆరోపించారు తనకుకూడా తన అల్లుడు ఎన్నో సార్లు ఫోన్ చేసి అదనంగా భూమి కావసలని.డబ్బు కావాలని వేదించేవాదని మృతురాలి తండ్రి కన్నీరు మున్నీరౌతున్నాడు.  వివరాలలోకేళితే…కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చిప్పల రాధాకృష్ణ నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వీరిలో పెద్ద కుమార్తె జాన్సీ( 20) ని పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లోని ద్వారకా నగర్ కు చెందిన వాడపల్లి వీర వెంకటేష్ తో 2018 మే నెల 5 వతేదీన వివాహం అయ్యింది. వివాహ సమయం లో జాన్సీ పుట్టింటివారు. వీరవెంకటేష్ కు 60 సెంట్లు భూమి 6 లక్షల రూపాయల నగదు కట్నంగా ఇచ్చారని జాన్సీ తల్లి దండ్రులు తెలుపుతున్నారు. జాన్సీ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.పెళ్ళైన దగ్గరనుండి అదనంగా భూమి తో పాటు కొంత నగదు కూడా కావాలని  వెంకటేష్ భార్య జాన్సీ ని వేదించేవాడని చివరకు తన కుమార్తెను అదనపు కట్నం దాహం తో బుధవారం రాత్రి హత్య చేసి కోవిడ్ సోకి మృతి చెందిందని అంటున్నారని మృతురాలి తండ్రి మీడియాకు తెలిపాడు.

ఈ సంఘటన పై పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లి దండ్రులు మద్దూరు గ్రామస్తులు కోరుతున్నారు .ఈ ఘటనపై ఏలూరు రూరల్ ఎస్ ఐ చావా సురేష్ మాట్లడుతూ.. బుధవారం వీర వెంకటేష్ అతని తండ్రి పెడవేగి మండలం జానం పేట లో వారికున్న పామాయిల్ తోటకు నీరు పట్టడానికి వెళ్లిన సమయం లో జాన్సీ ఇంటిలోనే ఆత్మహత్య చేసున్నట్టు తెలిపారు .భార్యా భర్తల మధ్య కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయని తన విచారణలో తెలిసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Himalayas: అంతరిక్షం నుంచి చేస్తూ హిమాలయాలు ఇంత అందంగా ఉంటాయా? ఈ అద్భుత చిత్రాన్ని మిస్ అవ్వకండి..