Man kills wife:బెంగళూరులో మరో దారుణ చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసి, శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. హత్య జరిగిన విషయం పోలీసులకు తెలియడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన మహిళను 26 ఏళ్ల సుమగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుండి 200 కిమీ దూరంలో ఉన్న చిత్రదుర్గ జిల్లాలోని కోననూరు గ్రామంలో సుమ, కరియప్ప దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంట ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గత నాలుగు రోజులుగా తన భార్య కనిపించడం లేదంటూ నిందితుడు డిసెంబర్ 29న ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తమ మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో డిసెంబర్ 25 రాత్రి నుంచి తన భార్య కనిపించకుండా పోయిందని మృతుడి భర్త కరియప్ప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను స్నానం చేసేందుకు వెళ్లిన సమయంలో భార్య ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదని చెప్పాడు. ఇరుగుపొరుగు, బంధువుల ఇళ్లలో కూడా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందం సహాయంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక ఇన్‌పుట్‌లను అందించిన తర్వాత కరియప్ప అదృశ్యమైనట్లు గుర్తించారు. పోలీసు బృందం అతనిని పట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు, అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. ఈ సంఘటనపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “మేము అతని ఇంటిని సందర్శించినప్పుడు, అతను మృతదేహాన్ని ఇంటి లోపల పూడ్చిపెట్టినట్లు గుర్తించామన్నారు. నేలపై ఉన్న శిధిలాలు కనిపించడంతో తవ్వి చూశామన్నారు. ఇంతలో మృతదేహం బయటపడింది,” అని తెలిపారు. దీంతో భర్త కరియప్ప కోసం వెతుకుతుండగానే పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. భర్తపై హత్య కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.